కోటప్పకొండపై కొలువైయున్న శ్రీ త్రికోటేశ్వరస్వామి వారిని రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ కుటుంబ సమేతంగా సోమవారం ఉదయం దర్శించుకున్నారు. స్వామి వారి ఆలయంలో దేవిరెడ్డి శ్రీనాథ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ పరిపాలన అధికారి రామకోటిరెడ్డి రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కు త్రికోటేశ్వరస్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. అంతకు ముందు కోటప్పకొండ దేవస్థానం చేరుకున్న రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ ను నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి శేషిరెడ్డి, జిల్లా సమాచార శాఖ డిప్యూటి డైరెక్టర్ అబ్ధుల్ రఫీక్, త్రికోటేశ్వర స్వామి ఆలయ పరిపాలన అధికారి రామకోటిరెడ్డి, నరసరావుపేట తహాశీల్ధార్ రమణా నాయక్ లు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలను అందజేశారు. అనంతరం ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దంపతులు తాడేపల్లిలోని స్వగృహానికి బయలుదేరి వెళ్ళారు.