నగరవాసుల సహకారంతోనే స్వచ్ఛ కాకినాడ..
Ens Balu
4
Kakinada
2021-10-11 13:36:45
నగరవాసుల సహకారం ఉంటేనే స్వచ్చ్ కాకినాడ సాధ్యపడుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం ఉదయం 10వ వార్డులో పర్యటించిన ఆయన పారిశుధ్య కార్యకలాపాలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాకినాడ ప్రజలు స్వచ్ఛ సర్వేక్షన్ 2021లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని, అదే ఉత్సాహంతో ఈ సారి కూడా స్వచ్ఛ సర్వేక్షన్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తమతోపాటు తమ చుట్టుపక్కల వారు కూడా పరిసరాలను కలుషితం చేయకుండా చూడాలన్నారు. స్ధానిక పారిశుధ్య కార్మికుల పనితీరుపై అసంత్రుప్తిని వ్యక్తం చేసిన ఆయన విధులలో అలసత్వం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.