పేదలకు అండగా సీఎం వైఎస్ జగన్..మంత్రి సీదిరి


Ens Balu
2
Srikakulam
2020-09-12 19:19:08

రాష్ట్రంలో పేదలకు అండగా ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఉంటారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు అన్నారు. పలా స కాశీబుగ్గ మున్సిపాలిటి పరిధిలో గల చిన్నబాడం గ్రామనికి చెందిన డిక్కల వేదవతి ఇటీవల అనారోగ్యం భారీన పడ్డారు. అనారోగ్యం నుండి కోలుకోవడానికి అవస రమగు ఖర్చు పెట్టే స్ధోమత లేక దయనీయ స్ధితిలో  ఉన్న వేదవతికి ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి సహాయం లభిస్తుందని తెలియడంతో దరఖాస్తు చేసుకు న్నారు. ముఖ్యమంత్రి సహాయనిదికి వేగవతి దరఖాస్తు చేయగా శాసన సభ్యులుగా ఉన్న అప్పల రాజు చొరవ తీసుకుని ఆమెకు రూ.25 వేలు మంజూరు కావడానికి కృషి చేసారు. ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి విడుదల అయిన రూ.25 వేల చెక్కును మంత్రి  శనివారం వేదవతికి పలాసలో అందించారు. పేదలకు అండగా ముఖ్య మంత్రి ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
సిఫార్సు