ప్రకాశం జిల్లాలోని ఎస్సీ కార్పోరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ లలో వ్యాపారాలు చేస్తున్నవారంతా తక్షణమే అద్దె బకాయిలు చెల్లించి రసీదులు పొందాలని యస్సీ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మార్కాపురం కోర్టు సెంటర్ లో ఉన్న యస్సీకార్పోరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న వాణిజ్య సముదాయాలను తనిఖీ చేశారు. అనంతరం అక్కడి వ్యాపారులతో మాట్లాడారు. ఇక్కడి సముదాయంలో 11 షాపులుండగా రూ.7 లక్షలు అద్దె బకాయిలు కావాల్సి వుందన్నారు. 1984లో కార్పోరేషన్ ద్వారా నిర్మించిన షాపులకు రూ.50 అద్దె నిమిత్తం ఒకొక్క షాపుకు నిర్ణయించగా 1998లో రూ.500 కు పెంచారన్నారు. అయినా గత 22 సంవత్సరాలుగా అద్దె విషయంలో ఎటువంటి మార్పుచేయలేదని పేర్కొన్నారు. అయితే వాణిజ్య సముదాయం కట్టి 37 సంవత్సరాలు దాటడం వలన భవన మరామత్తులు చేయవల్సి ఉన్నదని అన్నారు. నిరుపేద యస్సీల జీవనబృతి నిమిత్తం ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేసారు. అద్దె బకాయిలు కట్టి రసీదు పొందాలని సూచించారు. అంగీకరించిన వ్యాపారులు వారం పది రోజులలో బకాయిలు చెల్లిస్తామన్నారు. ఈడి వెంట యస్సీ కార్పోరేషన్ సిబ్బంది ఉసురుపాటి శ్రీను, తేళ్ళ విజయ్, వ్యాపారులు ఐజాక్, చింతగుంట్ల విజయమ్మా తదితరులు ఉన్నారు.