రాష్ట్ర ప్రభుత్వం మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కి కేటాయించిన చెత్తను తరలించే వాహనాలు జివిఎంసి పరిధిలోని వార్డులకు కేటాయింపు జరిగిందని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు. మంగళవారం బీచ్ రోడ్డులో డాక్టర్ వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన తో కలసి చెత్తను తరలించే కొత్త వాహనాలకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పధకంలో భాగంగా 672 చెత్త తరలించే వాహనాలు నగరానికి కేటాయించారని తెలిపారు. అందులో భాగంగా మొదటి విడతగా జివిఎంసికి 292 వాహనాలు వచ్చాయని, మిగిలిన వాహనాలు త్వరలోనే వస్తాయని తెలిపారు. వీటిని అన్ని వార్డులకు కేటాయించడం జరిగిందని, నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా చెత్తను ఎప్పటికప్పుడు డంపింగు యార్డుకు తరలించి విశాఖ నగరాన్ని స్వచ్ఛతా నగరంగా తీర్చిదిద్దుతామని, ఎప్పటికప్పుడు చెత్తను తరలించుతవలన ప్రజలను ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దగలమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెందుర్తి శాసన సభ్యులు ఆదీప్ రాజ్, అనకాపల్లి శాసన సభ్యులు జి. అమర్ నాద్, వై.సి.పి. నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె. రాజు, విఎంఆర్డిఎ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల, డిప్యుటీ మేయర్లు జియ్యని శ్రీధర్, కె. సతీష్, కార్పొరేటర్లు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, జోనల్ కమిషనర్లు బి. రాము, శివ ప్రసాద్, బి.వి.రమణ, కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, ఎఎంఒహెచ్ లు డాక్టరు రమణ మూర్తి, డాక్టరు కిషోర్, తదితర రాజకీయ నాయకులు మరియు జివిఎంసి అధికారులు పాల్గొన్నారు.