అక్రిడేటెడ్ జర్నలిస్టులందరూ హెల్త్ స్కీమ్ లో నమోదుకావాలి..


Ens Balu
10
Visakhapatnam
2021-10-12 16:10:07

విశాఖజిల్లాలో అక్రిడిటేషన్ పొందిన విలేఖరులు అందరూ హెల్త్ స్కీమ్ లో చేరాలని జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లికార్జున పిలుపునిచ్చారు.  మంగళవారం తన ఛాంబర్లో జరిగిన జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అక్రిడేషన్ పొందిన ప్రతి ఒక్క జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ప్రీమియం చెల్లించి కార్డు పొందవలసిందిగా వారికి అవగాహన కలిగించాలని సమాచార శాఖ డిడి వి. మణి రామ్ ను  ఆదేశించారు. సమావేశంలో మరో 223 మంది పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అక్రిడేషన్ లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.  వీరిలో వివిధ దిన పత్రికల కు చెందిన 135 మంది ఎలక్ట్రానిక్ మీడియా 52 మంది వెటరన్ జర్నలిస్టులు 15 మంది ఫ్రీలాన్స్ జర్నలిస్టులు 12 మందికి అక్రిడేషన్ లో మంజూరు చేయగా, జీఎస్టీ లేని దిన పత్రికలు వార మాస పత్రికలు వారికి తొమ్మిది తాత్కాలిక అక్రిడేషన్ లు మంజూరు చేయడం జరిగిందన్నారు.  ఈ సమావేశంలో సమాచార శాఖ ఉపసంచాలకులు వి మణిరామ్, ఏసిటిఓ శ్వేత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎల్లాజీ రావు గృహ నిర్మాణ శాఖ ఏఈ జోగారావు డివిజినల్ పిఆర్ఓ సాయిబాబా ఏపీఆర్వో రాములు తదితరులు పాల్గొన్నారు.