ఘోషా ఆసుపత్రిలో ఆహార పొట్లాల పంపిణీ..రామ్ కుమార్


Ens Balu
1
ఘోషా ఆసుపత్రి
2020-09-12 20:17:54

కరోనా వైరస్ వెంటాడుతున్న సమయంలో ఆపదలో ఉన్నవారి ఆకలి తీర్చే లక్ష్యంగా నిర్వగ్నంగా ఆసుపత్రుల్లో ఆహారం పింపిణీ చేస్తున్నట్టు బిజెపి విశాఖ దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ కొప్పలరామ్ కుమార్ చెప్పారు. శనివారం ఘోషా ఆసుపత్రిలో రోగుల బంధువులు, సెక్యూరిటీ సిబ్బందికి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ, కరోనా వైరస్ వచ్చి నిరుపేదల జీవితాలకు అతలాకుతలం చేసిందన్నారు. అలాంటి వారికి, రోగులకు సేవలు అందిస్తున్న వారికి తమవంతు సహాయంగా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమం నిరంతరం వెయ్యిరోజులు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకు న్నామన్నారు. ఒక్కోసారి ఒక్కోచోట ఈ అన్నదానం చేపట్టనున్నామని ఆయన వివరించారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి నిరాశ్రయులు అయినవారికి, అన్నం లేక అలమటించే వారికి పట్టెడు అన్నం పెట్టడానికి ముందుకి రావాలని ఈ సందర్భంగా రామ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈయనతోపాటు నియోజవకర్గంలోని బీజేపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.