విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి అన్నవరం దేవస్థానం అధికారులు బుధవారం పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఈఓ వి.త్రినాధరావు, ధర్మకర్తల మండలి సభ్యులు అమ్మవారి ఆలయానికి వెళ్లి వస్త్రాలు సమర్పించి వచ్చారు. ప్రతీఏటా నవరాత్రి సమయంలో జరిగే ఉత్సవాలకు దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితాగా వస్తుందని ఈఓ తెలియజేశారు. అమ్మవారికి వస్త్రాలు సమర్పించి రాష్ట్రం శుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు ఈఓ తెలియజేశారు.