కాకినాడ మేయర్ ను తొలగిస్తూ ఏపీ గెజిట్ విడుదల..


Ens Balu
4
Kakinada
2021-10-13 16:01:00

తూర్పుగోదారి జిల్లాలోని ప్రతిష్టాత్మక కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ సుంకర పావనిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమెను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు ఏపీ గెజిట్ రూపంలో జారీ చేయడం చర్చనీయాంశం అవుతుంది. వాస్తవానికి ఈ విషయం ఏపీ హైకోర్టు పరిధిలో వుంది. 22వ తేదీ వరకూ కోర్టు గడువు కూడా ఉంది అయినప్పటికీ రాష్ట్రప్రభుత్వం సుంకర పావనీని తప్పిస్తూ గెజిట్ నువిడుద చేయడం విశేషం.  కాగా ఓటింగ్కు ముందే మేయర్ సుంకర పావని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు అవిశ్వాస తీర్మానంపై జరిగే సమావేశానికి అభ్యంతరాలు చెప్పలేదు. అయితే ఫలితాన్ని మాత్రం తుది తీర్పునకు లోబడి ఉండాలని చెబుతూ తదుపరి విచారణను ఈ నెల 22 వ తేదీకి వాయిదా వేసింది. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తనను మేయర్ పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై సుంకర పావని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పునకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపిస్తున్నారు. 22 వ తేదీన కోర్టు తీర్పు వెలువరించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు హైకోర్టు తీర్పును ధిక్కరించేందిగా ఉందంటూ పావని విమరిస్తున్నారు.దీంతో సుంకర పావని పదవీచ్యుతులు అయ్యారు. కాకినాడ నగర పాలక సంస్థకు 2017 లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యతను సాధించి పాలక మండలని ఏర్పాటు చేసింది. అయితే 23 మంది కార్పొరేటర్లు మేయర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ అవిశ్వాస తీర్మానంనకు ప్రతిపాదించి జిల్లా కలెక్టర్ హరికిరణ్ వినతి పత్రాన్ని అందించారు. ఈ అక్టోబర్ నెల 5 వ తేదీన జరిగిన ప్రత్యేక సమావేశంలో మేయర్ పావని, డిప్యూటీ మేయర్ సత్తిబాబులపై కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. పాలక మండలిలో ప్రస్తుతం మొత్తం 44 మంది కార్పొరేటర్లు ఉండగా వారిలో నుంచి మేయర్, డిప్యూటీ మేయర్లకు వ్యతిరేకంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటేశారు. దీంతో వారిద్దరిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర ‌ప్ర‌భుత్వం కాకినాడ మేయ‌ర్‌ను తొల‌గిస్తూ గెజిట్‌ను విడుద‌ల చేసింది. దీనిపై మండిప‌డ్డ పావ‌ని, కేసు కోర్టు ప‌రిధిలో ఉండ‌గా రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఉన్న‌ప‌ళంగా మేయ‌ర్ ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం కోర్టు ధిక్క‌ర‌ణ అవుతుంద‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం రాజ‌ప‌త్రం ద్వారా మేయ‌ర్ ప‌ద‌వినుంచి తొల‌గించిన‌ప్ప‌టికీ తాను మేయ‌ర్  హోదాలోనే కొన‌సాగుతాన‌ని పావని  చెబుతుండటం విశేషం..