వీడియోజర్నలిస్టుల సంక్షేమానికి రూ.50వేలు విరాళం..


Ens Balu
12
Visakhapatnam
2021-10-13 16:24:16

మహా విశాఖ నగరంలోని వైజాగ్ వీడియో జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు బుధవారం రూ.50వేలు విరాళంగా అందజేశారు. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు సూర్య, కార్యవర్గ సభ్యులుకి అందచేసారు.ఈ సందర్భంగా శ్రీనుబాబు  మాట్లాడుతూ, గతఏడాది స్మార్ట్ సిటీ  వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ కి 50 వేలు అందజేశామని, ఈఏడాది విశాఖ వీడియో జర్నలిస్ట్ వెల్ఫేర్  అసోసియేషన్ కి 50000 అందజేస్తామన్నారు. విడియో జర్నలిస్ట్స్ సభ్యులు సంక్షేమానికి ఈ మొత్తాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తనవంతు సాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. విడియో జర్నలిస్ట్ లు సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే ప్రభుత్వంలోని పెద్దలను కలవనున్నట్టు శీనుబాబు చెప్పారు.