అమ్మవారి పండుగ ఏర్పాట్లను పరిశీలించిన జెసి కిశోర్..
Ens Balu
5
Vizianagaram
2021-10-14 08:12:27
విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్, గురువారం పట్టణంలో పర్యటించారు. ఆయన ముందుగా హుకుంపేట వెళ్లి, ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు ఇంటివద్ద తయారవుతున్న అమ్మవారి సిరిమాను, ఇరుసుమాను, రథాలను పరిశీలించారు. వెంకటరావుతో చర్చించారు. పనులను సకాలంలో పూర్తిచేయించాలని కోరారు. అనంతరం పైడితల్లి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలను, సంబంధిత శాఖల అధికారులతో కలిసి జెసి కిశోర్ సందర్శించారు. భక్తులకోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లను పరిశీలించారు. ఆలయం ఎదురుగా ఏర్పాటు చేస్తున్న కంట్రోల్ రూమును, విఐపి లాంజ్‌ను తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో జెసి కిశోర్‌తోపాటు, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, తాశీల్దార్ ఎం.ప్రభాకరరావు, ఆలయ అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.