విశాఖ లో ఘనంగా జాలాది10వ వర్ధంతి..
Ens Balu
4
Visakhapatnam
2021-10-14 10:02:12
విశాఖలో జాలాది రాజారావు 10వ వర్ధంతిని కుటుంబ సభ్యులు ఆర్కేబీచ్ లోని ఆయన విగ్రహం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సంద్భంగా జాలాది సతీమణి అగ్నేశమ్మ, జాలాది శ్రీనివాసరావు, కుమారి, నిర్మల మరియు కుటుంబ సభ్యులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాలాది సతీమణి మాట్లాడుతూ, ఆయన దూరమై నేటికి పదేళ్లు పూర్తవుతోందని, జాలాది భౌతికంగా మన మధ్యలేకపోయినా, పాట రూపంలో ఎల్లప్పుడూ ఆఖిలాంధ్ర ప్రేక్షకుల మధిలో కదలాడుతూ, గుర్తుకు వస్తూనే ఉంటారని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ, పాటలు ఉన్నంత కాలం జాలాది రచనలు, పాఠలు తెలుగువారంతా గుర్తుంచుకుంటారని అన్నారు. ఆయన రచించిన మంచి పాటలను ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జాలాది అభిమానులు పాల్గొన్నారు.