శ్రీకాకుళం జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టి సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా ఎస్.పి అమిత్ బర్థార్ అధ్యక్షతన ఎన్ఫోర్స్మెంట్ అండ్ రెవెన్యూ మొబైలైజేషన్ కార్యక్రమం గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లాలో నాటు సారా,అక్రమ మద్యం రవాణా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో కలెక్టర్,ఎస్.పి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సరిహద్దు గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా తయారీ స్థావరాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి సారా అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టాలని అన్నారు. సముద్ర మార్గం ద్వారా రవాణా అవుతున్న నాటు సారాకు అడ్డుకట్టు వేయాలని సూచించారు. సారా రహిత గ్రామాలుగా రూపొందించాలని ఆన్నారు.అటవీ శాఖ అధికారులుతో సమన్వయం చేసుకుంటూ ఏజెన్సీ ప్రాంతాల్లో నాటు సారా తయారీ స్థావరాలను గుర్తించి, నాటు సారా తయారీ కొసం ఉపయోగించే బెల్లపు ఊటలును నిర్వీర్యం చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్థార్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ప్రేరణా కార్యక్రమం చేపట్టి మారుమూల ప్రాంత గ్రామస్తులతో నాటుసారా నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమలు చేపట్టి, నాటు సార వలన కలిగే దుష్ప్రభావాలు గురించి గ్రామీణ ప్రజానీకానికి తెలియజేసి నాటుసారా తయారీ,వినియోగాన్ని అరికట్టాలని సూచించారు. తీర ప్రాంతాల ప్రజలతో మమేకమై, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సముద్ర మార్గాల ద్వారా రవాణా చేయబడుతున్న నాటు సారా రవాణను అడ్డుకట్ట వేయాలని సూచించారు. జిల్లాలో సరిహద్దు ప్రాంతాల వద్ద, చెక్ పోస్ట్ కేంద్రాల వద్ద తనిఖీలను మరింత ఉధృతం చేయాలని ఆదేశించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, గ్రామీణ మద్యం విక్రయాలు పాల్పడినవారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సూచించారు.ఒడిస్సా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో ఆంధ్ర, ఒడిశా స్థానిక పోలీసులు ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుంటూ జాయింట్ ఆపరేషన్ నిర్వహించి, నాటు సారా స్థావరాలపై ప్రత్యేక దాడులు నిర్వహించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా నియంత్రించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు, ఎక్సైజ్ సూపరిండెంట్ కె.యేశు దాసు,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.