శివయ్య విగ్రహానికి మీవంతు సహాయం చేయండి...
Ens Balu
2
అన్నవరం
2020-09-13 07:34:27
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, భక్తులను బ్రోచే చల్లనితల్లి శ్రీశ్రీశ్రీ అన్నవరం నూకాలమ్మతల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్మించే శివుని విగ్రహానికి దాతలు సహకరించాలని ధర్మకర్త గంగరాజు కోరారు. ఆదివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నూకాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో భక్తుల కోరిక మేరకు శివుని విగ్రహం నిర్మించతలపెట్టామన్నారు. వాటితోపాటు స్వామివారి విగ్రహం చుట్టూ నాలుగు చిన్ని మండపాల్లో వినాయకుడు, సాయిబాబా, సుబ్రమణ్యస్వామి, సూర్యభగవానుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్వామివారి విగ్రహాల నిర్మాణాలకు దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించాల్సిందిగా కోరారు. భక్తులు, 9492509024 అనే ఫోన్ పే నెంబరు ద్వారా కూడా విరాళాలు పంపించవచ్చునన్నారు. భక్తుల సహకారంతో స్వామివారి విగ్రహాలు ప్రతిష్టించాలనే ఉద్దేశ్యంతో విరాళాలు అడుగుతున్నామని ఆయన చెప్పారు. భక్తులంతా సహకరించాలని ఆయన కోరుతున్నారు.