ప్రతీఒక్కరూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
Ens Balu
8
Vizianagaram
2021-10-14 12:49:32
ప్రతీఒక్కరూ తమ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి సూచించారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, చాలా వరకూ వ్యాధులను నివారించవచ్చని అన్నారు. గ్లోబల్ హేండ్ వాషింగ్ డేకి సంబంధించిన పోస్టర్లను గురువారం తన ఛాంబర్‌లో కలెక్టర్ ఆవిష్కరించారు. ఇతర ప్రచార సామగ్రిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ కె.శివానందకుమార్, జిల్లా పంచాయితీ అధికారి సుభాషిణి, డ్వామా పిడి ఉమా పరమేశ్వరి, ఆర్‌డబ్ల్యూఎస్ ఇఇ వై.గోవిందరావు, ఎస్‌డిసి వెంకటేశ్వర్లు, హెచ్ఆర్‌డి కన్సల్టెంట్ టి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.