నైపుణ్యా భివృద్ధి శిక్షణ తో స్వయం ఉపాధి..
Ens Balu
8
Vizianagaram
2021-10-14 12:51:08
యువతకు నచ్చిన రంగం లో నైపుణ్యా భివృద్ధి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పించడం లేదా ఆసక్తి గల వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని సంయుక్త కలెక్టర్ ఆసరా జే. వెంకట రావు తెలిపారు. అందు కోసం టార్గెట్ గ్రూప్ లను గుర్తించాలని అన్నారు. గురువారం అయన ఛాంబర్ లో స్కిల్ డెవలప్మెంట్ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఫుడ్ ప్రాసెసింగ్ , డైరీ అభివృద్ధి, మేషన్, ప్లంబింగ్ , ఎలక్ట్రికల్ తదితర రంగాల్లో ప్రస్తుతం డిమాండ్ అధికంగా ఉందని, ఆయా రంగాల్లో ఆసక్తి ఉన్న యువకులను గుర్తించి శిక్షణ కు సిద్ధం చేయాలనీ అధికారులను ఆదేశించారు. మత్స్య , ఉద్యాన శాఖలలో మార్కెటింగ్ స్కిల్ల్స్ ను నేర్పించడం ద్వారా సుస్థిరమైన ఆదాయం అందుకునేలా చేయవచ్చని అన్నారు. ప్రతి శాఖ వారి పరిధి లో గల అవకాశాలను గుర్తించి, శిక్షణ కోసం టార్గెట్ గ్రూప్ లను కూడా గుర్తించాలన్నారు. ఈ సమావేశం లో డి.అర్-.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ అశోక్, వ్యవసాయ సఖ జే.డి ఆశ దేవి, పశు సంవర్ధక జే.డి డా. రమణ, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్, సెట్విజ్ సి .ఈ.ఓ ఉద్యాన, మత్స్య, పరిశ్రమల, కార్మిక శాఖల అధికారులు పాల్గొన్నారు.