రైతులకు ఈ-క్రాప్ లో నమోదు తప్పనిసరి..


Ens Balu
9
Vizianagaram
2021-10-16 09:10:06

పంటల  నమోదు జరగక పోతే  రైతుకు రావలసిన రైతుకు భరోసా, పంటల నష్టం తదితర పధకాలు  వర్తించవని సంయుక్త కలెక్టర్ రెవిన్యూ డా. జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు.  కౌలు రైతులు, ఈనాం భూముల్లో పండించే రైతులు, ప్రభుత్వ భూముల్లో పండించే రైతులు ఎవరైనా గానీ  వాస్తవంగా పంటలువేసే రైతులందరూ ఈ క్రాప్ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని ఆయన తెలిపారు.  గ్రామ స్థాయి  వ్యవసాయ సహాయకుల వద్ద కు వెళ్లి వెంటనే ఈ.కే.వై.సి  నమోదు చేసుకోవాలన్నారు. శనివారం  కల్లెక్టరేట్ సమావేశ మందిరం లో వ్యవసాయాధికారులతో  ఈ క్రాప్ నమోదు,  గులాబ్ తుఫాన్ నష్టాల అంచనా, ధాన్యం సేకరణ  తదితర అంశాల పై సమీక్షించారు.  ఈ క్రాప్ నమోదు లో కురుపాం, మెరకముడిదం మండలాల్లో శత శాతం నమోదు జరిగినందుకు ఆయా అధికారులను అభినందించారు. బాడంగి మండలం అతి తక్కువగా నమోదు చేసినందున ప్రత్యెక దృష్టి పెట్టాలని సూచించారు. ఇటీవల   సంభవించిన గులాబ్  తుఫాన్  కు జరిగిన పంట నష్టాల పై ఆరా తీసారు.   వ్యవసాయ శాఖ కు సంబంధించిన 1580 హెక్టార్లలో , ఉద్యాన పంటలకు సంబంధించి 750 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనాలు వేయడం జరిగిందన్నారు.  పంటల వారీగా,  మండల వారీగా నివేదికలను పూర్తి స్థాయి లో వెంటనే అందజేయాలని వ్యవసాయాధికారులకు ఆదేశించారు.  పంటల నష్టాల అంచనాలను సంబంధిత శాసన శాసన సభ్యుల దృష్టి లో కూడా పెట్టాలని సూచించారు. 

ధాన్యం సేకరణ  కేంద్రాలను ప్రారంభించాలి:
జిల్లాలో నున్న 624 రైర్తు భరోసా కేంద్రాల్లో, 230  ధాన్యం సేకరణ కేంద్రాల్లో   ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఏర్పాట్లను గావించాలని జే.సి ఆదేశించారు. సోమవారం  అన్ని చోట బ్యానర్లను పెట్టి ప్రారంభించాలని అన్నారు.  ప్రతి కేంద్రం వద్ద తేమ యంత్రాలను సిద్ధం చేయాలన్నారు.  డ్వాక్రా సభ్యలకు, గిరి మత్ర లకు, రైతు భరోసా కేంద్రాల  సిబ్బందికి వెంటనే సమావేశం ఏర్పాటు చేసి  వారిని సమాయత్తం చేయాలనీ,  సమావేశపు మినిట్స్ ను పంపలన్నారు.   నవంబర్ నాటికీ 9150  మెట్రిక్ టన్నుల పంట వచ్చే అవకాశం ఉన్నందున అందుకు  తగ్గట్టుగా ఏర్పాట్లు గావించాలన్నారు.  జనవరి కి మరో 2 లక్షల మెట్రిక్ తన్నులు వస్తుందని, వచ్చిన పంటను ఎప్పటికప్పుడు సేకరించి మిల్లర్లకు ఇవ్వాలని,   పెండింగ్ ఉండే  సహించేది  లేదని స్పష్టం చేసారు. రానున్న మూడు రోజుల్లో భారి వర్ష సూచన ఉన్నందున పొట్ట  దశ లో నున్న పంట నష్టం జరగకుండా రైతు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  నీరు పొలం లో నిల్వ ఉండకుండా  బయటకు పంపే లా ప్రణాళికలు వేసుకోవాలని అన్నారు. వ్యవసాయ అధికారులంత రైతులకు పంట నష్టం జరగకుండా జాగ్రతలు తీసుకునేలా  అవగాహన కలిగించాలన్నారు.  ఈ సమావేశం లో డి డి లు  నందు, ఆనంద్,  ఎ.డి. అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.