కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి..


Ens Balu
6
Visakhapatnam
2021-10-17 11:25:48

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారు వినియోగించుకోవాలని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే పిలుపునిచ్చారు. ఆదివారం సర్క్యూట్ హౌస్ లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా కులాంతర వివాహాలకు రూ 2.5 లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ముద్ర యోజన, ఉజ్వల యోజన, ఆవాస్ యోజన, జన్ యోజన మొదలైన పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల వారికి చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రశంసించారు.  స్వర్గీయ డాక్టర్ వైయస్ శేఖర్ రెడ్డి తో తనకు గల అనుబంధాన్నితలచుకున్నారు.  మీడియా వారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా ప్రజల వద్దకు తీసుకు వెళ్లేందుకు తోడ్పడాలని కోరారు.   ఈ సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక అధ్యక్షులు బి అనిల్ కుమార్, ఏపీ తెలంగాణ ఇంచార్జ్ బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.