మహిళాభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట..
Ens Balu
7
Narasannapeta
2021-10-17 12:05:16
మహిళాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర అ ఉపముఖ్యమంత్రి ఇ ధర్మాన కృష్ణదాస్ అన్నారు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ముగింపు ఉత్సవాలను నరసన్నపేటలో నిర్వహించారు ఈ సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించారు దాదాపు రెండు కిలోమీటర్ల మేర ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు అనంతరం నరసన్నపేట లో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పట్ల దృష్టి సారించి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోందన్నారు. మహిళాభ్యున్నతికి పెద్దపీట వేస్తున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మెజారిటీ పథకాల్లో లబ్ధిదారులు మహిళలేనని ఆయన పేర్కొన్నారు. మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుందని తద్వారా రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ ఆలోచన అన్నారు. మాట ఇచ్చిన విధంగానే 4 విడతల్లో అక్క చెల్లెమ్మలకు ఆసరా అందుతుందని కృష్ణ దాస్ చెప్పారు. 30 లక్షల ఇళ్ళ పట్టాలు మహిళల పేరుమీదే ఇచ్చామని ఆయన అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళ ఎదగాలని వారికి సమాన అవకాశాలను సీఎం జగన్ కల్పిస్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, డీఅర్డిఎ పీడీ బి.శాంతి శ్రీ, ఎంపీపీలు ఆరంగి మురళి, వాన గోపి, పొందర, కూరాకుల, వెలమ కార్పొరేషన్ చైర్పర్సన్ ప్రతినిధులు రాజాపు అప్పన్న, పంగ బావాజీ నాయుడు, ఏఎంసీ చైర్మన్ పొన్నాన దాలినాయుడు.,కె సి హెచ్ బి. గుప్త, స్థానిక సర్పంచ్ బురెళ్ళ శంకర్, జెడ్పీటీసీ ప్రతినిధులు చింతు రామారావు, మెండ రాంబాబు, ముద్దాడ బైరాగి నాయుడు, తంగి మురళీకృష్ణ, సురంగి నరసింగరావు, బొబ్బాది ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.