పైడితలమ్మ సిరిమాను ఉత్సవానికి అంతా సిద్ధం..


Ens Balu
3
Vizianagaram
2021-10-17 16:41:24

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కోరి కొలిచేవారి కొంగుబంగారం.. విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలకు జిల్లా కేంద్రం సిద్ధమయ్యింది. సోమ, మంగళ వారాల్లో జరిగే తోలేళ్ళ ఉత్సవం, సిరిమాను ఉత్సవాల నిర్వహణ కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం తో పాటు నగరంలోని ప్రధాన ఆకర్షణలు కోట, గంటస్తంభం తదితర ప్రదేశాలను విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆధ్వర్యంలో అధికారులు అమ్మవారి ఉత్సవాలను ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు మద్యం షాపులను అధికారులు మూయించేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందో బస్తు కూడా ఏర్పాటు చేశారు.