ప్రజలందరికీ జీవన విధానంపై అవగాహన కలిగివుండాలని, మంచి ఆహారం, మంచి అలవాట్లతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి తెలిపారు. సోమవారం ఐఎంఎ హాలులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, నేచర్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన బాలల హక్కుల అవగాహనా కార్యక్రామానికి ముఖ్య అతిధిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా వుంటే సమాజం ఆరోగ్యంగా వుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా ఆరోగ్య శాఖాధికారి డా.రమణ కుమారి, హైమావతి, బాలరాజు, ఐసిడిఎస్. పిడి. రాజేశ్వరి తదితరులు పాల్గోన్నారు.