స్పందన అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి..
Ens Balu
7
Srikakulam
2021-10-18 12:45:17
అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డాక్టర్ కె. శ్రీనివాసులు, ఆర్. శ్రీరాములు నాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి అర్జీదారులు నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందనకు వచ్చే దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చూడాలన్నారు. వివిధ సమస్యలపై ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలుపై 288 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.