విజయనగరం జిల్లాలో అధికారులు గ్రామ, వార్డు సచివాలయాల వారానికి మూడు రోజులు తనిఖీ చేయాలని సంయుక్త కలెక్టర్ అభివృద్ధి డా. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయాల పర్యటనలో సిబ్బందిన హాజరును సంబంధిత స్పందన , ఈ-సేవ దరఖాస్తులు పెండింగ్ లేకుండా డిస్పోస్ జరిగేల చూడాలన్నారు. సచివాలయ సిబ్బంది రికార్డులు ఏ విధంగా నిర్వహిస్తున్నారో కూడా తనిఖీలు చేయాలన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రారంభిస్తున్న సంక్షేమ పధకాలు సక్రమంగా ప్రజలకు అందుతున్నదీ లేనిది తనిఖీ చేయాలన్నారు. ప్రజలకు ఈ పధకాల పట్ల అవగాహన కలిగించే బాధ్యత సచివాలయ సిబ్బంది పై ఉందని స్పష్టం చేసారు. సచివాలయ సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తున్నదీ లేనిది కూడా ప్రత్యేకా ధికారులు తనిఖీ చేయాలన్నారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్లు డా. జి.సి కిషోర్ కుమార్, జే. వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.