ప్రభుత్వ పథకాలన్నీ పారదర్శకంగానే..భూమన
Ens Balu
3
తిరుపతి
2020-09-13 12:41:11
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే ద్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని, ఆడపడుచులను కోటీశ్వరులను చేసేందుకే వై.ఎస్. ఆర్. ఆసరా పథకం తీసుకు వచ్చామని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అన్నారు. వై.ఎస్.ఆర్. ఆసరా వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన ఆదివారంనాడు స్థానిక చేపల మార్కెట్ వెనుక గల వార్డు సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి , నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా పాల్గొని ప్రజనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మీ ఇంటిలో, మీ వీధిలో ఏ సమస్య ఉన్నా మీరు పరిగెత్తి మునిసిపల్ ఆఫీస్ కు రాకుండా మీ వీధిలోని సచివాలయం ఏర్పాటు చేసి, మీకోసం వాలంటీర్ల ను ఏర్పాటు చేసి మీకు ఏ సమస్య రాకుండా వెంటనే పరిష్కారం చేస్తున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దాదాపు 10 సంవత్సరాలుగా ఇండ్లకోసం ఎదురు చూస్తున్న నగరవాసులకు సుమారు 24 వేల మందికి ఇండ్లు మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వంలో వలే ఎదో మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం తమకు చేత కాదని, ఇచ్చిన మాట కట్టుబడి పనిచేసే ధీరుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో నే మ్యానిఫెస్టోలో ఇచ్చిన మేరకు అన్ని హామీలను పూర్తి చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగనన్న దేనన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా మాట్లాడుతూ వై.ఎస్.ఆర్. ఆసరా వారోత్సవాల్లో రెండవరోజు చేపల మార్కెట్ వద్ద 7 వార్డులకు సంభందించి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ని 28 గ్రూపులకు వై.ఎస్.ఆర్. ఆసరా పథకం కింద సుమారు 30 కోట్ల రూపాయలు జమచేయడం జరిగిందన్నారు. మీరు పొదుపు చేసుకున్న నగదు అత్యవసరాల కోసం వాడుకుని, తిరిగి ఏదైనా వ్యాపారం చేసేందుకు ఆలోచిస్తున్న వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మీరు ఆర్థికంగా ఎదిగేందుకు ఇబ్బంది పడాల్సిన పనిలేకుండా ఈ ప్రభుత్వం మీ అవసరాల కోసం సాయం అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాల అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. కాగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 3132 స్వయం సహాయక సంఘాలకు 123.144 కోట్ల రూపాయలు జమచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, మెప్మా రమణ, వై.సి.పి. నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు, పాల్గొన్నారు.