12 మందికి నియామక పత్రాలను అందజేత.
Ens Balu
6
Srikakulam
2021-10-20 07:33:04
శ్రీకాకుళం జిల్లాలో వివిధ శాఖలలో పనిచేస్తూ మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలలోని 12 మందికి బుధవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ కారుణ్య నియామక పత్రాలను అందజేసారు. కారుణ్య నియామక కమిటీ నిర్ణయం మేరకు 12 మందికి కారుణ్య నియామకాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎల్లవేళల తోడుగా ఉంటుందని, అందులో భాగంగానే నేడు కారుణ్య నియామక పత్రాలను అందిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి, సభాపతి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి డా. కిల్లి కృపారాణి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి పిరియా విజయ, కళింగకోమటి కార్పొరేషన్ అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, మాజీ పురపాలక సంఘ అధ్యక్షురాలు మెంటాడ వెంకట పద్మావతి, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, బి.సి.సంక్షేమ శాఖాధికారి జి.రాజారావు తదితరులు పాల్గొన్నారు.