దళిత ఎమ్మెల్యేని అవమానించిన వారిని శిక్షించాల్సిందే..


Ens Balu
4
విశాఖపట్నం
2020-09-13 12:54:22

విశాఖ జిల్లా పాయకరావుపేట వైఎస్సార్సీపీ కి చెందిన దళిత ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కి సొంతపార్టీ లోనే ఘోర అవమానం జరగడం దారుణమని టీడీపీ విశాఖ జిల్లా ఎస్సీ  సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ అన్నారు. పార్టీలోని ఒక చిన్న నాయకుడు దళిత ఎమ్మెల్యేని వాడు, వీడు, అని దురుసుగా మాట్లాడం దళితులను అణగదొక్కాలనే చేసే ప్రయత్నమేనన్నారు. ఈ సంద్భంగా విశాఖలో ఆయన మీడియాలో మాట్లాడుతూ, ఎస్.రాయవరం మాజీ ఎంపీటీసీ బొలిశెట్టి గోవిందరావు కార్యకర్తలు, నాయకులతో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సమావేశం పట్టి మరీ దళితుడైన బాబూరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీలు వేరైనా దళితులంతా ఒక్కటే నన్నారు. అగ్రవర్ణాలు దళితులను కించపరిచేలా వ్యవహరిస్తే, ఆ వ్యక్తి ఏ పార్టీ వ్యక్తైనా తార తమ్యం లేకుండా అంభేత్కర్ వారసులుగా స్పందిస్తామన్నారు. అంతేకాకుండా మార్కెట్ చైర్మన్ భర్త పై ఎమ్మెల్యే  ఎదుటే దాడి చెయ్యడమే కాకుండా ఎమ్మెల్యే పైనే అహంకార ధోరణి తో వ్యాఖ్యలు చెయ్యడం వైఎస్సార్సీపీ అధిష్టాన పర్యవేక్షణకు నిలువెత్తు నిదర్శమన్నారు. దళితులపై దాడులు జరుగుతుంటే వైఎస్సార్సీపీ వ్యవహరిస్తున్న తీరు తన సొంత పార్టీ నేతల విషయంలోను అనుసరిస్తోందని దుయ్యబట్టారు. నా అండ లేకుండా నువ్వు ఎలా ఎమ్మెల్యేగా గెలిచావని పార్టీ కార్యకర్తలు పాల్గొన్న సమావేశంలోనే బహిరంగ వ్యాఖ్యలు చేసి గొల్ల బాబూరావుని అవమానించారంటే ఈయన వెనుక పెద్ద తలకాయలనే ఉన్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. సాధారణ ఎంపీటీసీగా ఉంటూ 100 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడో విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఎమ్మెల్యే గొల్లకి జరిగిన అవమానం పై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి  వెంటనే స్పందించి ఎంపీటీసీ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనకు టీడీపీ దళిత కుటుంబం అంతా అండగా ఉంటుందని, వారి కోసం చిత్తశుద్ధితో పని చేస్తూ వారి అభ్యుదయం కోసం పనిచేస్తోందని చెప్పారు. తక్షణమే ఎంపీటీసీ బొలిశెట్టి గోవిందరావు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. దళితులకు జరుగుతున్న అన్యాయం పై పార్టీలకు అతీతంగా స్పందించాలని ఇతర రాజకీయ పార్టీల నేతలను కోరారు.