రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలూ పని చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్రారంభించిన జగనన్న తోడు కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో జరిగిన వర్చువల్ కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 31465 మందికి లబ్ది చేకూరేలా బ్యాంకులకు కట్టిన వడ్డీ కోటి తొమ్మిది లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి అన్నారు. లబ్దిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. అయితే.. ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికీ కొందరు లబ్ధిదారులు బ్యాంకు వడ్డీలు కట్టనివారు త్వరగా చెల్లించాలని అన్నారు. సచివాలయ సిబ్బంది, అధికారులు వారిలో అవగాహన తీసుకురావాలని మంత్రి అన్నారు. వడ్డీ పూర్తిగా కట్టని వారు డిసెంబర్ లోపు పూర్తిగా చెల్లిస్తే.. డిసెంబర్ లొనే జరిగే మలివిడత జగనన్న తోడు కార్యక్రమంలో ప్రభుత్వం వడ్డీ తిరిగి చెల్లిస్తుందని అన్నారు. రాష్ట్రంలోని దాదాపు లక్ష మంది వీధి వ్యాపారులకు జగనన్న తోడు అండగా నిలుస్తోందని అన్నారు. ప్రభుత్వం పేదలకు స్వర్ణయుగంగా మారిందని మంత్రి ఈసందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా జాయింట్ కలెక్టర్లు వేణు గోపాల్ రెడ్డి, అరుణ్ బాబు, విశ్వేశ్వర రావు, ప్రాజెక్టు అధికారి, డిఆర్‌డిఎ, పలువురు అధికారులు,లబ్దిదారులు పాల్గొన్నారు.