శ్రీరామ చరిత్రను రసరమ్యంగా అందించిన వాల్మీకి..


Ens Balu
7
Vizianagaram
2021-10-20 10:51:10

శ్రీరాముని చరితను రసరమ్యంగా లిఖించి రామాయణాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ   పేర్కొన్నారు. వాల్మీకి రచించిన రామాయణం నేడు యావత్ ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జయంతిని పురష్కరించుకొని వారి జీవిత చరిత్రను ఒకసారి స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని  పేర్కొన్నారు. వాల్మీకి పూర్వశ్రమ జీవితం గురించి రామాయణంలోని ఉత్తరకాండలో వివరించబడిందని అన్నారు. ఆ కథనం ప్రకారం వాల్మీకి బందిపోటుగా బాటసారుల నుండి సొత్తును దోచుకొని జీవితం సాగించేవాడని తెలిపారు. మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహించుకోవడం, ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఆయన రచించిన రామాయణం దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.మహేష్ కుమార్, జె.వెంకట రావు , జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  బి.సి.సంక్షేమ శాఖాధికారి డి.కీర్తి, బి సి కులాల కు చెందిన ప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.