నిర్మాణ రంగం లో నైపుణ్యాభివృద్ధి శిక్షణనిస్తున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ (నేక్) ద్వారా, ప్లంబర్ లకు రెండురోజుల ఉచిత శిక్షణ కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ సహాయ సంచాలకులు ఎస్ వి ఎస్ రవి కుమార్ తెలిపారు. ఈనెల 26,27 తేదీలలో విశాఖపట్నం జిల్లాపరిషత్ వద్ద గల "నేక్" కేంద్రం లో శిక్షణ ఇస్తామని చెప్పారు. 18 సం..లు నిండి, ప్లంబింగ్ పనిలో అనుభవం కలిగి ఉండాలని శిక్షణకు ఎటువంటి రుసుము లేదని శిక్షణ రెండు రోజులు ఉచిత భోజనం, స్టేషనరీ సరఫరాతో శిక్షణానంతరం కిర్లోస్కర్ కంపెనీ వారిచే (కే.బీ.ఎల్) సర్టిఫికేట్, కేంద్ర ప్రభుత్వం చే వేరొక సర్టిఫికేట్ అందజేయ బడుతుందని ఆయన వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆధార్ కార్డ్ జిరాక్స్, 4 పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో 22వతేదీ లోగా 8500502395 లేదా 9866883199 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలన్నారు.