విజయనగరం జిల్లాపరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు అక్టోబరు 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు జిల్లాపరిషత్ కార్యాలయంలో జరగనున్నాయని ముఖ్య కార్యనిర్వహణ అధికారి టి.వెంకటేశ్వరరావు తెలిపారు. మొదటి, రెండో స్థాయీ సంఘ సమావేశాలు 27న ఉదయం 10.30 గం.లకు, 12.30 గం.లకు జెడ్పీ ఛైర్మన్ అధ్యక్షతన వారి ఛాంబరులో జరుగుతాయన్నారు. 28న ఉదయం 10.30 గం.లకు 4వ, 12.30 గంటలకు 7వ స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ ఛైర్మన్ అధ్యక్షతన ఆయన ఛాంబరులోనే జరుగుతాయని పేర్కొన్నారు. 29న ఉదయం 11 గం.లకు 3వ స్థాయీ సంఘ సమావేశం, మధ్యాహ్నం 2 గంటలకు 5వ స్థాయీ సంఘ సమావేశం, 4 గంటలకు 6వ స్థాయీ సంఘ సమావేశం జెడ్పీ మినీ మీటింగ్ హాలులో జరుగుతాయన్నారు. ఆయా స్థాయీ సంఘ సభ్యులు, అధికారులు షెడ్యూలు ప్రకారం హాజరు కావాలని కోరారు.