శారదా పీఠాధిపీఠంలో అమాత్యులు...
Ens Balu
1
చినముషిడివాడ
2020-09-13 17:18:23
విశాఖలోని చినముషిడివాడలో ఉన్న శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి , స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాజీలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే అదీప్ రాజ్ పలువురు దర్శించుకున్నారు. చాతుర్మాస్య దీక్ష ముగించుకుని ఆదివా రం నాడు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి విశాఖ శారదా పీఠానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్వామిజీ ని కలసి ఆశీర్వాదం పొందారు. పీఠం సంప్రదాయం ప్రకారం మేళతాళాల మధ్య వేదపండితులు ఘన స్వాగతం పలికారు. పీఠంలో పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామిజీని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. స్వామిజీతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం పీఠంలో వల్లిదేవసేన సహిత సుబ్రమణ్యస్వామి, మేధా దక్షిణ మూర్తి స్వామి వార్ల దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి తీర్థ ప్రసాదాలను అందించారు.