తల్లి తండ్రి తరువాత అతి ముఖ్యమైన వ్యవస్థ పోలీసు వ్యవస్థ అని అయితే ఇందులోని మంచిని గుర్తించకుండా కొంతమంది చెడును బహిర్గతం చేయకుండా మనకోసం మన సమాజం కోసం అసువులు బాసిన వారిని మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా జడ్జి వై వి ఎన్ బి జి పార్థసారథి అన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమరవీరులకు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, ఎస్పీ సెంథిల్ కుమార్ లతో పాటు అమరవీరుల ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ మన వ్యవస్థకు ఎంతో గొప్ప కుటుంబాన్ని అదేవిధంగా అమర వీరులను ఇవ్వడం జరిగిందని వీరి ద్వారా మనం రక్షించబడుతున్నామని ప్రజలు సుఖంగా ఉండడానికి కారణం ఒక రక్షణ వ్యవస్థ అని రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పోతున్నా మన్నా అందుకు పోలీసులే కారణమని సాధారణంగా మంచి చేసే వారి విషయంలో కొంత వ్యతిరేకత కూడా ఉంటుంది .అయితే ఎప్పుడూ ఆ వ్యతిరేకతను మర్చిపోయి వారిలోని సేవలను గుర్తించాలని అన్నారు. కోర్టు కన్నా ముందే ఏ సమస్య అయినా పోలీస్ స్టేషన్ కు వెళుతుందని పోలీసులు స్నేహ పూర్వక వాతావరణంలో ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలని అన్నారు. అదేవిధంగా రాత్రింబవళ్లు సెలవులు లేకుండా పనిచేయడం వల్ల వారు కొంత చిరాకు పడటం జరుగవచ్చునని అయితే బాధితులు కూడా వారి కష్టాలను అర్థం చేసుకోని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ మాట్లాడుతూ ఎవరైతే మన దేశం కోసం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం ప్రాణాలు అర్పించారో వారిని మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మొదట ఈ సంఘటన 1959 అక్టోబర్ 21న జరగడంతో అమరవీరుల సంస్మరణ దినాన్ని అదేరోజున జరుపుకోవడం జరుగుతోందని అన్నారు. వారి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు, వారు చేసిన సేవలను మననం చేసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము జరుగుతోందన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా క్లిష్ట సమయంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి,పోలీసు వ్యవస్థ వారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ప్రజల కోసం చేసిన సేవలు మర్చిపోలేమని, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ ప్రజలకు సేవ చేసే సమయంలో ఎంతోమంది అశువులు బాయడం కూడా జరిగిందని అటువంటి క్లిష్ట సమయంలో కూడా పోలీసు శాఖ అందించిన సేవలను మర్చిపోలేమ న్నారు. కొంతమంది హక్కులను కాలదోసి సంఘంలో గొడవలు సృష్టించే సమయంలో కూడా పోలీసులు అందించినసేవలు మరువలేనివని వారికుటుంబసభ్యులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాని అమరులైన వారికి జోహార్లు అని అన్నారు.
త్యాగనిరతి కి ప్రతిరూపంగా పోలీసుల అమరవీరుల దినంగా అక్టోబర్ 21 ని భావిస్తున్నామని ఎంతోమంది విధినిర్వహణలో అమలు కావడం జరిగిందని వారందరినీ మననం చేసుకునేందుకే అమరవీరుల దినోత్సవం ను జరుపుకుంటున్నా మన్నారు. కరోనా కష్టకాలంలో కోవిడ్ ను ఎదుర్కొనేందుకు పోలీసుల సేవలు అందించడం జరిగిందని నిరంతరం ప్రజల కోసం సేవలందిస్తూ కొంతమంది అశువులు బాయడం కూడా జరిగిందని అన్నారు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు అవగాహన కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ప్రజల సంరక్షణ ప్రధమ బాధ్యతగా పోలీసుల సేవలు మరువలేనివని అన్నారు. అనంతరం స్పెషల్ ఫోర్స్ మెంట్ ఏ ఎస్ పి విద్యాసాగర్ నాయుడు అమరవీరుల పేర్లను చదువుతూ అందరికీ మననం చేశారు. ఈ సందర్భంగా వారికి గౌరవసూచకంగా అందరూ గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘవిద్రోహ శక్తుల చేతిలో మరణించిన చిత్తూరు జిల్లాకు సంబంధించిన హుస్సేన్ భాష, సురేంద్ర, జవహర్ లాల్ నాయక్, దేవేంద్ర కుమార్, ఆంజనేయులు, ఈశ్వరయ్య, ముని శంకర్, ప్రదీప్ కుమార్, మోహన్ కిషోర్, కృష్ణమూర్తి కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సంవత్సరం మరణించిన ఏ ఆర్ ఎస్ ఐ ఆంజనేయులు కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు, ఈశ్వరయ్య కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు, మునిశంకర్ కుటుంబ సభ్యులకు 10.5 లక్షలు జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలు అందించారు.ఈ కార్యక్రమంలో ఇతర పోలీసు అధికారులతో పాటు అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.