తెలుగు దేశం పార్టీని వ్యతిరేకిస్తూ జనం చీకొడుతున్నా ప్రతిపక్ష నాయకుడు చంద్రబా బునాయుడుకు సిగ్గురావడం లేదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా విమర్శించారు. గురువారం నరసన్నపేట నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్ తో కలిసి మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత నరసన్నపేట నియోజకవర్గంలో పర్యటించారు. కోమర్తి, చితవానిపేట, తలసముద్రంలలో రూ.35 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు తన రాజకీయ స్వలాభం కోసం కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఆయన తన అనుచరులతో మాట్లాడించిన తీరు దారుణంగా ఉందన్నారు. ప్రజలు కష్టాలున్న సమయంలో విజయవాడలో లేని వ్యక్తి ముందస్తు ప్రణాళికల ప్రకారం రెచ్చగొట్టారని ఆరోపించారు. సుపరిపాలన అందిస్తున్న సీఎంను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడాలి అనే ధోరణిలో చంద్రబాబు తీరు ఉండడం ఎంతో దారుణమన్నారు. రాజకీయ వికృతి క్రీడలో భాగంగా ఘోరాతి ఘోరంగా చంద్రబాబు ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేయించారన్నారు. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంయమనం తో ఉండాలని తమను కోరారన్నారు. అయినా కార్యకర్తలు, నాయకులు సంయమనం కోల్పోయే పరిస్థితికి చంద్రబాబు తెస్తున్నారని, చంద్రబాబు మాట్లాడే భాష ప్రజలు చూస్తున్నారని. వారే మళ్లీ గుణ పాఠం నేర్పుతారని అన్నారు,
మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని అన్నారు. అది చూసి ఓర్వ లేక ప్రతిపక్షం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు కొద్దీ తీరు దారుణంగా తయారైందన్నారు. సిగ్గుమాలిన వ్యక్తిగా చంద్రబాబు రూపాంతరం చెందారన్నారు. పట్ట్బాలి నూట్లాడిన మాటలు కన్న తల్లులు, అడవారిని కించపరిచే లా లేవా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో విలువలు ఉండాలని అన్నారు. అవినీతి రహిత పాలన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారన్నారు.
యువ నాయకులు పోలాకి జడ్పిటిసి సభ్యులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల కేరాఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని చెప్పారు. టీడీపీ ఎన్ని ప్రేలావనలు చేసినా విజ్ఞత గల వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడు సంయమనం కోల్పోరనీ, కానీ ఎల్లవేళలా సహనంతో ఉంటారని అనుకోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు డాక్టర్ కిల్లి కృపారాణి, పోలాకి జెడ్పీటీసీ డాక్టర్ ధర్మాడ కృష్ణచైతన్య, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వర్ రావు, ఐసిడిఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.