విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని కెఎల్‌పురం-2 వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్ రిజిష్టర్‌ను పరిశీలించారు. పెండింగ్ దరఖాస్తులపై ఆరాతీశారు. సచివాలయ పరిధిలో జరిగిన కోవిడ్ వేక్సినేషన్, రైస్ కార్డుల జారీ, ఈకెవైసి నమోదు, జగనన్న శాశ్వత గృహ హక్కు పథకాల గురించి ప్రశ్నించారు. నరత్నాల అమలుపై సిబ్బందిని ప్రశ్నించారు. స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలనుంచి వచ్చే దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని, అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగులంతా సమయపాలన పాటించాలన్న కలెక్టర్ సిబ్బంది మొత్తం అంతా మూమెంట్ రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రజలకు ఏ ఒక్క సేవలోనూ అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.