జర్నలిస్టులకు అండగా ఉంటాం.. విజయసాయిరెడ్డి..


Ens Balu
4
GVMC Park
2021-10-22 10:05:43

ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత  ఇవ్వడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎంపీ విజయసాయిరెడ్డిని జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలను విజయసాయిరెడ్డి వద్ద శ్రీనుబాబు ప్రస్తావించారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి వీలైనంత మేరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విజయ్ సాయిరెడ్డిని శ్రీనుబాబు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.