పేదరికాన్ని పారద్రోలడానికి సంక్షేమ పథకాలు..


Ens Balu
2
Srikakulam
2021-10-22 12:40:33

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదరికాన్ని పారద్రోలడానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని స్పీకర్ తమ్మినేని అన్నారు. వైయస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు కార్యక్రమంలో భాగంగా సరుబుజ్జిలి మండలం రొట్ట వలస గ్రామంలో శుక్రవారం ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ తమ్మినేని పాల్గొన్నారు. అధికంగా పాల్గొన్న మహిళా సంఘాలు ముందుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సరుబుజ్జిలి మండలంలో 611 సంఘాలకు 4 కోట్ల 50 లక్షల రూపాయల నమూనా చెక్కును డ్వాక్రా చెల్లెమ్మలకు స్పీకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా రాజకీయ జీవితంలో  అనేకమంది ముఖ్యమంత్రులను చూశానని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇంత పరిణితి చెందిన ముఖ్యమంత్రి చూడలేదని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో ప్రామాణికం కలిగిన పాలన అందిస్తున్నారని, అర్హత ప్రామాణికంగా పాలన సాగిస్తున్నారన్నారు. పిల్లలను బడికి పంపిస్తే ఆ పిల్లలకి ఉన్నత చదువులు చదివిస్తానని చెప్పి విద్య కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో డ్వాక్రా అక్కాచెల్లెళ్లకు రుణ మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చి ఆ హామీ ప్రకారం రెండో విడత డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో నేడు నగదు జమ చేశారని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె.వి.జి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ శివానందమూర్తి (బాబు), జెడ్ పి టి సి సురవరపు నాగేశ్వరరావు, బెవర మల్లేశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు కోవిలాపు శేఖర్, స్థానిక సర్పంచ్ ముడాడ్ల రమణ, అధికారులు పాల్గొన్నారు.