కెజిహెచ్ లో మంచినీటి ఆర్ఓ ప్లాంటు ప్రారంభం..
Ens Balu
2
కింగ్ జార్జి ఆసుపత్రి
2020-09-13 21:35:59
కరోనా వైరస్ వ్యాప్తి ఉద్రుతంగా వున్నసమయంలో రోగులు, వారికి సేవలు చేసే పారామెడికల్ సిబ్బంది సురక్షితమైన మంచినీరు తాగాల్సిన అవసరం ఎంతైనా వుం దని కెజిహెచ్ సూపరింటెండెంట్ డా.పివి సుధాకర్ అన్నారు. ఆదివారం కెజిహెచ్‌లోని సిఎస్‌ఆర్ బ్లాక్‌లోని కోవిడ్ సెంటర్‌లో రోటరీ వైజాగ్ కపుల్స్ రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ మరియు రోటార్టీ క్లబ్ ఆఫ్ వైజాగ్ మెట్రో ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన, గంటలకు రెండువేల లీటర్లు శుద్ధిచేయగల సామర్ధ్యం ఉన్న మంచినీటి ఆర్ఓ ప్లాంటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాంట్ ఏర్పాటుతో పాటు 5 అంతస్తుల్లో 30 పాయింట్ల ద్వారా మంచినీరు అందిం చేందుకు సహాయం చేయడం అభినందనీయమన్నారు. కోవిడ్ సమయంలో మరింత మంది దాతలు ముందుకి వచ్చిన తమకు తోచిన సహాయం కెజిహెచ్ కి వస్తురూపంలో చేయడం ద్వారా అవి రోగులకు నేరుగా చేరే అవకాశం వుంటుందన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు శ్రీరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు