కార్మికుల సంక్షేమానికే అధిక ప్రాధాన్యత..
Ens Balu
4
Anantapur
2021-10-23 10:48:17
కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. శనివారం 60 సంవత్సరాల పైబడి వున్న కార్మికుల స్థానంలో వారి పిల్లలకి అవకాశాలు కల్పిస్తూ మేయర్ ఛాంబర్ లో మేయర్ వసీం చేతుల మీదుగా ఉత్తర్వులు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య,కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి, నగర కమిషనర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ నగర పాలక సంస్థ లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ వయోభారం వల్ల ఇబ్బందులు పడుకూడదన్న ఉద్దేశ్యం తో వారి కుటుంబీకులకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు.అకింతబావంతో పనిచేయాలని సూచించారు. కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా తమ పాలకవర్గం పనిచేస్తోందన్నారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు అనిల్ కుమార్ రెడ్డి ,కమల్ భూషణ్, బాబా ఫక్రుద్దీన్, మునిశేఖర్, చంద్రమోహన్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ మెంబర్ చంద్రలేఖ ,కార్యదర్శి సంఘం శ్రీనివాసులు,నాయకులు దాదు, రాధాకృష్ణ, కుల్లాయి స్వామి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.