దాతల సహకారంతోనే ఆలయాల అభివృద్ధి..


Ens Balu
3
Simhachalam
2021-10-27 13:18:41

దాతల సహకారంతోనే దేవాలయాల అభివృద్ధి సాధ్యపడుతుందని అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు. బుధవారం సింహద్రి అప్పన్నను దర్శించుకున్న ఆయన అనంతరం హుండీ లెక్కింపులో పాల్గొని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ తాజాగా జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా తాను అధికారులు పలు సూచనలు చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా సామాన్య భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని వివరించామన్నారు. సింహగిరిపైన, కొండ దిగువున భక్తులకు ఉచిత సాత్రాలు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందన్నారు. మంచినీరు, మరుగుదోడ్లు వంటి కనీస సౌకర్యాలు మరిన్ని కల్పించాలని కోరామన్నారు. కొండ దిగువన వరహ పుష్కరిణి అభివృద్ధి చేయాలని, అక్కడ ఉన్న స్మశానానికి వెళ్లే రహదారులను మెరుగుపర్చాలని ఈవో ఎంవీ సూర్యకళను కోరినట్టు కోరారు. సింహగిరిపైన ఆలయ వర్గాలు నిర్వహిస్తున్న ఆర్జిత సేవలు భక్తులు ప్రశంసలు పొందుతున్నాయన్నారు. సంతానలక్ష్మీ యంత్రంగల కప్పస్తంభంకు భక్తుల నుంచి తాకిడి పెరిగిందన్నారు. ఎవ్వరితే కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని సంతానాన్ని కోరుకుంటారో వారి కోర్కికులు నేరవేరుతాయన్నారు.ప్రతి ఒక్కరూ దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.