పత్రికల్లో వార్తలొస్తేనే స్పందిస్తారా..


Ens Balu
3
Anantapur
2021-10-28 09:38:33

పత్రికలలో వార్తలు వస్తేనే సమస్యలపై స్పందిస్తారా అంటూ సిబ్బంది తీరుపై నగర మేయర్ మహమ్మద్ వసీం అసంతృప్తి వ్యక్తం చేశారు.నగరంలోని 18 వ డివిజన్ పరిధిలోని గుల్జార్ పేట్ లో అమ్మవారిశ్యాల వీధిలో దెబ్బతిన్న డ్రైనేజీలు, స్కావెంజర్  లైన్లను గురువారం మేయర్  పరిశీలించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడం,దెబ్బతిన్న డ్రైన్ లపై పత్రికలలో  వస్తే తప్ప సంబంధిత సచివాలయాల కార్యదర్శులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సచివాలయంలో పరిధిలో తిరిగితే సమస్యలు తెలుస్తాయని,కార్యాలయంలో కూర్చుంటే సమస్యలు ఎలా తెలుస్తాయని మేయర్ ప్రశ్నించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయంలో వ్యవస్థ అందుబాటులోకి తీసుకువచ్చారని మీరు పనిచేయకుంటే ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తారన్నారు.వెంటనే గుల్జార్ పేటలో పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలని మేయర్  ఆదేశించారు. అనంతరం అదిముర్తి నగర్ లోని 25వ సచివాలయంను మేయర్ వసీం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అదే విధంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిమ్ ను పరిశీలించి వినియోగంలోకి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.ఆయా  కార్యక్రమాలలో   కార్పొరేటర్లు ముంతాజ్ బేగం,కమల్ భూషణ్,లీలావతి, ఈ ఈ రామ్మోహన్ రెడ్డి,కార్యదర్శి  సంఘం శ్రీనివాసులు, డిఈ సుధారాణి ,ఏ ఈ  నాగజ్యోతి , నాయకులు దాదు, సచివాలయ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.