26ఏళ్లుగా ఆ వాల్ పెయింట్ చెరగనే లేదు..
Ens Balu
3
ఆచంట
2020-09-13 21:57:32
ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రెంట్ చేనేత కులాల ప్రాంతీయ సదస్సు ఛలో రాజమండ్రి.. 21.08.1994కోసం ఆచంట గ్రామంలో ఓ గోడపై దీనిని రాయించారు. అ26 ఏళ్లు గడుస్తున్నా రాసిన వాల్ పైయింటింగ్ నేటికి సజీవంగా నిలిచి వుంది. అప్పటి సమావేశానికి గుర్తుగా చేనేత సామాజిక వర్గం వారికి నాటి సమావేశం తేదీని గుర్తు చేస్తూనే వుంది. ఈ వాల్ పెయింగ్ టింగ్ ను రుద్రాక్షల సత్యనారాయణ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టగా విశేషంగా వైరల్ అవుతుంది. చేనేత ఉద్యమ కారులు, చేనేత కులాల ఐక్యత కోసం, హక్కుల కోసం, చేనేత రంగం అభివృద్ధి కోసం, చేనేత కార్మికుల సంక్షేమం కోసం పద్మశాలీ నేతలు శీరం రామచంద్రమూర్తి , రామ్మూర్తి, చిందం రాదాకృష్ణ, దేవాంగ ప్రముఖులు కీ.శే బొమ్మన రామచంద్రరావు, కాలేపు సత్యనారాయణ , సంజీవరావు, కరికాలభక్తుల ప్రముఖులు, కర్ణభక్త, కుర్ణి, స్వకులశాలీ, పట్టుశాలీ ప్రముఖులు లక్షలాది మందితో ప్రాంతీయ సదస్సు రాజమండ్రిలో విజయవంతం చేసినట్టుగా చెబుతారు. నేటి యువత నాటి పెద్దల ఆలోచన విదానాలను ఆధర్శవంతంగా తీసుకొని జాతి ఐక్యతకు కృషిచేయాలని, ఆంద్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ను బలపర్చాలని నేటి ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రెంట్ రాష్ట్ర కార్యవర్గం కోరుతోంది...