జర్నలిస్టుల పిల్లలకు ఫీజురాయితీకై వినతి..


Ens Balu
2
Visakhapatnam
2021-10-30 05:45:15

విశాఖ జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు నూరు శాతం స్కూల్‌ ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లిఖార్జున్‌ను కోరారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మల్లిఖార్జున్‌ను శ్రీనుబాబు కలసి గత ఐదేళ్లుగా ఫీజు రాయితీలకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వుల కాఫీలను కలెక్టర్‌కు అందజేశారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులకు ఆయా కాఫీలను అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పెండింగ్‌ అక్రిడెషన్లు వేగవంతంగా జారీ చేయాలని తద్వారా హెల్త్‌ ఇన్యూరెన్స్‌, బస్‌ పాసు,రైల్వే పాసులకు దోహదం చేస్తుందన్నారు. వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం వినతిపై జిల్లా కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఫీజు రాయితీ ఉత్తర్వులు మంజూరుకానున్నట్లు శ్రీనుబాబు చెప్పారు.