జివిఎంసీ కమిషనర్ లక్ష్మీషా కి గంట్ల సత్కారం..


Ens Balu
2
జివిఎంసీ
2021-10-30 14:19:33

మహావిశాఖనగర పాలక సంస్థ కమిషనర్ గా చేరిన డా.లక్ష్మీషా ను జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, అప్పన్న ధర్మ కర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రినుబాబు కలిసి శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అప్పన్న చిత్రపటాన్ని బహుకరించారు. మంచి అధికారిగా పేరున్నమీరు విశాఖ నగరపాలక సంస్థకు కమిషనర్ గా రావడం ఎంతో ఆనందంగా వున్నదన్నారు. మంచి నగరానికి మంచి అధికారి వస్తే వాటి యొక్క ఫలితాలు అదేస్థాయిలో వుంటాయని శ్రీనుబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా విశాఖలో మంచి వాతావరణం, అధికారులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టుల కలయిక వుంటుందని కమిషనర్ కి వివరించారు.