ఆదిత్యునికి దేవాంగ కార్పోరేషన్ చైర్మన్ పూజలు..
Ens Balu
6
Arasavilli
2021-10-30 14:22:18
కలియుగ ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రధాత అయిన అరసవెల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర చేనేత దేవంగ కార్పొరేషన్ ఛైర్మన్ బీరక సురేంద్ర శనివారం దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాశ్ ఆలయ మర్యాదలతో , వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను ఛైర్మన్ కు అందజేసారు. అనంతరం అనివేటి మండపంలో వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికి స్వామి వారి చిత్రపటాన్ని ఛైర్మన్ కు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాశ్, బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు గుత్తు రాజారావు, నగర దేవాంగ సంఘం జిల్లా అధ్యశ్రులు నల్ల అప్పారావు, ఉపాధ్యక్షులు గుత్తు చిన్నారావు, దోరసన్యాసిరాజు, సభ్యులు గుంటముక్కల పాపారావు, చప్పటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.