అధిష్టానం ద్రుష్టికి గొల్ల అవమానం గోల..!


Ens Balu
3
Payakaraopeta
2020-09-14 09:28:35

అధికారపార్టీకి చెందిన విశాఖజిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావుని పార్టీకే చెందిన ఎస్.రాయవరం మాజీ ఎంపీటిసి సభ్యుడు బొలిశెట్టి గోవిందరావు కార్య కర్తల సమావేశంలో దారుణంగా మాట్లాడి అవమాన పరిచిన విషయం అధిష్టానం ద్రుష్టికి వెళ్లినట్టు తెలిసింది. అంతేకాదు నేరుగా ఎమ్మెల్యే విజయసాయిరెడ్డితో తన కు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేసినట్టుగా కూడా సమాచారం. గత మూడు నెలలుగా ఎమ్మెల్యే గొల్లబాబూరావు తనకు నియోజకవర్గంలో స్వేచ్ఛలేకుండా కొంద రు నాయకులు పదే పదే అడ్డుపడుతూ దళిత ప్రజాప్రతినిధినైన తనను అవమానిస్తున్నారంటూ వార్తలకెక్కారు. నియోజవర్గంలోని ఎక్కడ సమావేశం పెట్టినా ఇదే విషయాన్ని మీడియా వద్ద ప్రస్తావిస్తూ వచ్చేవారు. ఆ విషయం మీడియాలో గొల్లుమన్న తరువాత మూడు నెలలకి అడ్డురోడ్డులోని ఎమ్మెల్యే ఇంటి వద్ద జరిగిన సమావేశంలో బొలిశెట్టి గోవిందరావు, పాయకరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త చంటి వర్గాలకు మధ్య పెద్ద గొడవ జరిగి గత సోమవారం ఎమ్మెల్యే ముందే కొట్టుకున్నారు. అయితే పదేళ్లుగా పార్టీకి సేవచేసిన తనను కాదని, చంటి వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని బొలిశెట్టిగోవిందరావు గొడవ అనంతరం పార్టీ కార్యకర్తలు, నాయకులతో తన ఇలాకాలోని తోటలో సమావేశం అయ్యి ఎమ్మెల్యేని ఇష్టాను సారంగా మాట్లాడారు. ఆ విషయం కాస్తా అటు మీడియాకి, ఇటు నిఘా వర్గాలకు చేరడంతో ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లింది. ఇంతజరిగిన తరువాత కూడా సదరు గోవిందరావు స్థానిక మీడియాని కట్టడిచేసి, బెదిరించి మరీ జరిగిన తంతుని టివీలు, పత్రికల్లోనూ రాకుండా జాగ్రత్త పడ్డారు. ఆ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా బహిర్గతం చేసింది. ఎమ్మెల్యే ముందు జరిగిన గొడవను కూడా బయటపెట్టింది. దీంతో విషయం కాస్తా ఊరూనోట తెలిసిపోయింది. నిఘా వర్గాలు సైతం పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టుగా ప్రభుత్వానికి చేరవేశాయి. ఎమ్మెల్యేని ఒక సాధారణ మాజీ ఎంపీటిసి దారుణంగా అవమానించడంతోపాటు, తాను లేకపోతే పార్టీ గెలవదన్నట్టుగా మాట్లడటాన్ని తీవ్రంగా పరిగణించింది. దానికి బలమైన ఆధారాలు సమావేశంలో మాట్లాడిన మాటలన్నీ సాక్ష్యంగా ఉండటంతో అసలు బొలిశెట్టి గోవిందరావు అనే వ్యక్తి వ్యవహారాలపై కూపీలాగే పనిలో పడినట్టు సమాచారం అందుతోంది. గొడవ జరిగిన రోజు వీడియో ఫుటేజి, మాట్లాడిన సంభాషన సేకరించే పనికూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. దళిత ఎమ్మెల్యేని అవమానించడం ఒక ఎత్తైతే ఒక మాజీ ఎంపీటిసికి 100 కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడివనే కోణంలో వివరాలు సేకరణ జరుగుతుందని కూడా నియోజవర్గంలో ప్రచారం జరుగుతోంది. కేవలం తన దగ్గర డబ్బులున్నాయని, పార్టీలో కొందరు పెద్దల సహకారం తనకుందనే ధీమానే బొలిశెట్టి గోవిందరావు చేసిన వ్యాఖ్యలపై ఇటు ఎస్సీ, ఎస్టీ సంఘాలు కూడా గొల్లు మంటున్నాయి. దళిత ఎమ్మెల్యేపై కిందిస్థాయి అధికారపార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడాటాన్ని తప్పుపట్టి ఈ విషయాన్ని తమ సంఘాల ద్వారా ఆందోళన చేసే పనిలో పడ్డాయి.