ఏఓబీలో ఆపరేషన్ గ్రీన్ గంజా హంట్..
Ens Balu
7
ఏఓబీ కేంప్
2021-11-03 15:42:24
తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆపరేషన్ గ్రీన్ గంజా హంట్ కి శ్రీకారం చుట్టారు. జిల్లా నుంచి అత్యధికంగా గంజాయి రవాణా కావడం.. దానికి మూలాలు తెలుసుకున్న పోలీసులు ఆపరేషన్ గ్రీన్ గంజాహంట్ పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు తెరలేపారు. ఇందులో బుధవారం భాగంగా ఎక్కడైతే గంజాయిని పండిస్తారో ఆ ప్రాంతం మోతుగూడెం మండలం ఒడిసా కేంప్ ప్రాంతానికి తాను స్వయంగా వెళ్లి గంజాయి మొక్కలను పెకిలించారు. ఆపై వాటిని స్వయంగా తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో కాకినాడి జిల్లా కేంద్రంలోని మీడియా కూడా అక్కడికి వెళ్లింది. పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు వెళ్లి అక్కడ సుమారు రూ.2 కోట్ల విలువైన గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అంతేకాదు ఈ గంజాయి సాగు వలన కలిగే నష్టాలు, నమోదవుతున్న కేసులను ఏఓబీ(ఆంధ్రా ఒడిసా బోర్డర్) లో ఏ ఎవరెవరు గంజాయి సాగుచేయిస్తున్నారో వారికి పడిన శిక్షలను అక్కడి గిరిజనులకు, సాగు దారులకు వివరించారు. ఇదంతా స్టేట్ పోలీస్ బాస్ డీజీపీ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఎస్పీ తెలియజేశారు. రాష్ట్రంలో అత్యధికంగా గంజాయి రవాణా ఒక్క తూర్పుగోదావరి జిల్లా నుంచి జరుగుతుండటం, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడుతున్న కేసుల్లో కూడా జిల్లాకి చెందిన వారు ఉండటంతో మొత్తం మూలాలతో సహా గంజాయిని నిర్వీర్యం చేయాలని పోలీసుశాఖ భావించి ఈ నిర్మూళన చర్యలు చేపట్టినట్టు చెప్పారు. మరోవైపు ప్రభుత్వం ఈ గంజాయి, నాటుసారా వ్యవహారంలో కాస్త సీరియస్ గా ఉండటంతో పోలీసులు తమ దూకుడుని పెంచారు. జిల్లాఎస్పీ స్వయంగా తన సిబ్బందితో కలిసి వెళ్లి మరీ ఈ కార్యక్రమం చేపట్టడం, అదీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టడం విశేషం. కార్యక్రమం మొత్తం పోలీసు తుపాకీ పహారా మధ్య కట్టుదిట్టంగా సాగింది. విధినిర్వహణలో కీలకంగా వ్యవహరించే ఎస్పీ దైర్యంగా ముందగు వేయడంతో మీడయా కూడా ఆయన వెంటన నడిచింది. అక్కడి గిరిజనులు కూడా ఇకపై గంజాయి పంటను పండించమని పోలీసులకు హామీ ఇచ్చారు. ఈ చర్యలతో మంచి ఫలితాలు వస్తాయని పోలీసుశాఖ భావిస్తోంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, ఎస్ఈబీ డిఎస్పీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.