వీజెఎఫ్ లో ఘనంగా దీపావళి వేడుకలు..


Ens Balu
3
Visakhapatnam
2021-11-03 17:32:02

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో జర్నలిస్టులకు బాణాసంచా, మిఠాయిలు, ప్రమిదులు తదితర సామాగ్రిని పంపిణి  చేశారు.ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిధిగా హాజరైన  నెడ్ క్యాప్ ఛైర్మన్ కె.కె.రాజు మాట్లాడుతూ, సమాజానికి నిరంతరం సేవలందించే జర్నలిస్టులు దీపావళి పండుగను తమ కుటుంబ సభ్యులతో కలిసి అనందంగా జరుపుకోవాలన్నారు. సుమారు వెయ్యి మంది జర్నలిస్టులకు క్రమం తప్పకుండా దీపావళి సామాగ్రిని అందజేస్తున్న వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, పండుగలు, క్రీడలు, విద్య, వైద్యం ఇలా అన్నింటా కూడా తమ సభ్యులకు వీజెఎఫ్ అందజేయడం అభినందనీయమన్నారు. తాను జర్నలిస్టులకు నిరంతరం అండగా ఉంటానన్నారు.. పురాన ఇతిహాస కథనాల ప్రకారం దీపావళి పండుగకి విశిష్టమైన స్థానం ఉందన్నారు. మహాలక్ష్మిని పూజించడంతో పాటు ప్రతీ ఒక్కరూ పర్యావరణానికి ఇబ్బందులు లేకుండా ఈ పండుగను జరుపుకోవాలని, పిండి వంటలతో పర్వదినాన్ని ఆస్వాదించాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరికి ఆ సింహాద్రినాధుడు ఆశీస్సులు ఉండాలని తాను కోరుకున్నట్లు చెప్పారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు,ఎస్.దుర్గారావులు మాట్లాడుతూ అన్ని పండుగలు నిర్వహించిన ఘనత వైజాగ్ జర్నలిస్టుల ఫోరంకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా సభ్యుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందరి సహకారంతోనే అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయగలుగుతున్నామన్నారు. త్వరలోనే జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం, మీడియా అవార్డుల ప్రధానం ఘనంగానిర్వహించనున్నట్లు చెప్పారు. మీడియా అవార్డుల కమిటీ ఛైర్మన్, వీజెఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్. నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బి.కె. రామేశ్వరి తదితరులు జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు టి.నానాజీ, కోశాధికారి పి ఎన్ మూర్తి. జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, పి. నానాజీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తొలుత అతిధులు చేతులు మీదుగా బాణాసంచా, మీఠాయిలు, ప్రమిదలు ప్యాక్లను పలువురు జర్నలిస్టులకు అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి.