చేపల ఉత్పత్తితో ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలి.. ఫిషరీష్ డిడి ఎన్.నిర్మలకుమారి..


Ens Balu
4
Salur
2021-11-04 03:53:44

మత్స్యకారులు చేపల పెంపకం, ఉత్పత్తితో ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలని విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి పిలుపు నిచ్చారు. బుధవారం విజయనగరం జిల్లాలోని చేప పిల్లల పెంపక కేంద్రాల నుంచి తీసుకు వచ్చిన 10.87లక్షలు చేప పిల్లలను, సాలూరు మండలంలోని, చిన చీపురువలస వెంగళరాయునిసాగరం రిజర్వాయర్ లో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆహ్వానితులతో కలిసి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వం మత్స్య సంపదను అభివ్రుద్ధి పెంచాలనే  లక్ష్యంలో జిల్లాలోని అన్ని రిజర్వాయర్ లలో చేపపిల్లల పెంపకాన్ని చేపడుతుందన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో చేప పిల్లలను రిజర్వాయర్ లో వదిలిపెట్టామన్నారు. చేపల వినియోగాన్ని పెంపకాన్ని మరింత పెంచాలనే మత్స్యశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ కార్యక్రమాలు చేపడుతన్నట్టు వివరించారు. ఆహ్వానితులు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం మత్సకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పార్వతి, ఎఫ్డీఓ నాగమణి, స్థానిక సర్పంచ్ రాములమ్మ, ఎంపీపీ, వైఎస్ ఎంపీపీలు రెడ్డి సురేష్ కుమార్, త్రినాధ్, , ఎంపీటీసీ అనూష, సొసైటీ అధ్యక్షుడు తిరుపతి,  అధిక సంఖ్యలో మాత్సకారులు పాల్గొన్నారు.