వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ EnsLive, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net చెప్పింది అక్షర సత్యమైంది..ఇదేదో మేము గొప్పకోసం చెబుతున్నమాట కాదు. సాక్షాత్తూ విశాఖ జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ డా.మల్లిఖార్జు ఫైవ్ మెన్ కమిటీ ఇచ్చిన నివేదికతో రూఢీచేసి మరీప్రకటించారు. ప్రస్తుతం విజెఎఫ్ కార్యవర్గంగా చెప్పుకుంటున్న వారికి చట్టబద్దత లేదని తేల్చేశారు. మంగళవారం విశాఖజిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఫైవ్ మెన్ కమిటీ, మరో పదిమంది సేవ్ విజెఎఫ్ పోరాటసభ్యుల సమక్షంలో జిల్లా కలెక్టర్ కాలంచెల్లిన కార్యవర్గం చేసిన తప్పులను ప్రకటించారు. విజెఎఫ్ పై వేసిన రెండు కేసుల సమయంలో కోర్టుకి ఇచ్చిన అఫడవిట్ కంటే ప్రస్తుత కాలం చెల్లిన కమిటీ అధనంగా ఓట్లు చేర్చినట్టు తమ అధికారుల బ్రుంధం తేల్చిందని స్పష్టం చేశారు. నిధుల విషయంలో రికార్డులు సక్రమంగా లేవని, రూ.19 లక్షలకు సంబంధించిన లెక్కలు తేలలేదని, ఆడిట్ రిపోర్టులో చాలావాటికి లెక్కలు లేవన్నారు. సదరు అనధికార కార్యవర్గం చేర్చిన ఓటర్లను తప్పించి మొత్తం ఓటర్ల జాబితా మళ్లీ సవరణ చేయిస్తామని తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఈ వ్యవహారం మొత్తం తేలేంత వరకూ విజెఎఫ్ ఫైమెన్ కమిటీ స్వాధీనం చేసుకుంటుందని, దానికి సర్క్యులర్ జారీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఆ తరువాత ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతామని
చెప్పారు. ఈ విషయంలో సభ్యులందరూ సహకరించాలన్నారు. కాలం చెల్లిన కమిటీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసినా ఫలించలేదు.
2015 నుంచి ఈ కాలంచెల్లిన కమిటీ అనధికారికంగా వ్యవహరిస్తోందని, అది పూర్తిగా సొసైటీ యాక్టుకి విరుద్దమని, యాక్టులోని చాప్టర్-4 లోని అంశాలను సేవ్ విజెఎఫ్ సభ్యులకు కలెక్టర్ కి ద్రుష్టికి తీసుకెళ్లారు. కోర్టులో కేసులు పడినపుడు సొసైటీ యాక్టు నిబంధన, విజెఎఫ్ బైలా ప్రకారం సర్వసభ్య సమావేశం పెట్టాల్సి వుందని, కానీ ఆ విషయం సభ్యులకు చెప్పకుండా కాలం చెల్లిన కార్యవర్గం సభ్యులను మోసం చేయడంతోపాటు, ప్రతీఏటా సర్వసభ్య సమావేశం జరిపినట్టుగా నకిలీ రికార్డులు స్రుష్టించిన విషయాన్ని కూడా కలెక్టర్ ద్రుష్టికి.. కాలం చెల్లిన కార్యవర్గం జిల్లా రిజిస్ట్రార్ కి సమర్పించిన వాటినే బయటపెట్టింది. దీనితో అనధికార కార్యవర్గం తప్పులన్నీ ఒకేసారి జిల్లా కలెక్టర్ బయటపెట్టారు. మళ్లీ కొత్తగా సభ్యత్వాలను స్క్రూట్నీ చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ సభ్యత్వాలు ఇచ్చిన తరువాత ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. దానికి సదరు కాలం చెల్లిన కార్యవర్గం అడ్డుచెప్పినా కలెక్టర్ నిరభ్యంతరంగా తోసిపుచ్చారు. అన్నిపూర్తయిన తరువాత సర్వసభ్య సమావేశం కూడా పెట్టి నివేదకలు సభ్యులకు చెప్పాలని సేవ్ విజెఎఫ్ సభ్యులు పట్టు పట్టడంతో కలెక్టర్ అంగీకరించారు.
మాకు తిరుగులేదు..ఎదురులేదు..మమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తారని రొమ్మువిరుచుకొని మరీ అప్రజాస్వామికంగా 2015 నుంచి 2023వరకూ పరిపాలించిన కాలంచెల్లిన కమిటీ తీరును జిల్లా కలెక్టర్ ఆధారాలతో సహా బయటపెట్టడంతో కమిటీ కంగుతినాల్సి వచ్చింది. ఇపుడు 2015 నుంచి 2023 వరకూ ప్రతీ ఏటా లెక్కలు, వాటికి బిల్లులు, బ్యాంక్ స్టేట్ మెంట్,ఈఫైలింగ్, చేసిన ఖర్చులు, నార్లభవన్, డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ ద్వారా వచ్చిన ఆదాయాలు, వ్యవయాలకు సంబంధించిన ఖర్చులు సభ్యులకు లిఖిత పూర్వకంగా సభ్యులకు తెలియజేయాల్సి వుంది.అలా తెలియజేయలేని పక్షంలో విజెఎఫ్ సభ్యులను మోసం చేసినందుకు సభ్యులు సర్వసభ్య తీర్మానంతో క్రిమినల్ కేసు పెట్టే అవకాశం కూడా ఉందని జిల్లా కలెక్టర్ తేల్చిచెప్పారు. సమావేశం మధ్యలో ఆదాయలు, వ్యవయాలు, నార్లభవన్ లోని షాపుల అగ్రిమెంట్లు ఇస్తామని, అవి మాదగ్గర ఉన్నాయని కాలంచెల్లిన కమిటీ జిల్లా కలెక్టర్ కు విన్నవించే ప్రయత్నం చేసినా..ఇంత వరకూ ఆడిట్ డిపార్ట్ మెంట్ కి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడంతో సదరు సభ్యులు తెల్లమొహం వేయాల్సి వచ్చింది.
జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున 20 మందిని(10 మంది విజెఎఫ్ కాలం చెల్లిన కార్యవర్గం, మరో 10 మంది సేవ్ విజెఎఫ్ సభ్యులు) రమ్మని సమాచారశాఖ ద్వారా కబురు పంపితే..కాలం చెల్లిన కార్యవర్గంలో సభ్యులు లేకపోవడం, ఉన్నా కలెక్టర్ సమావేశానికి రావడానికి ముందుకి రాకపోవడంతో గత్యంతరం లేక సదరు కాలం చెల్లిన కమిటీ వారికి అనుకూలంగా ఉన్నవారిని, కలెక్టర్ ముందు బలం ప్రదర్శించడానికి మరో ఐదుగురు వ్యక్తులను వెంటతీసుకొని వచ్చింది. ఎంతమంది వచ్చినా జిల్లా కలెక్టర్ వాస్తవాలను, మోసాలను, టపా టపా చదివి వినిపించడంతో వచ్చినవారంతా తెల్లమొహం వేయాల్సివచ్చింది. తమ తప్పులేదని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆఖరికి తమచేతిలో నుంచి విజెఎఫ్ తాళాలు, రికార్డులు మొత్తం ఫైవ్ మెన్ కమిటీ చేతులో పెట్టాలని కలెక్టర్ ఆదేశించడంతో తొలిసారిగా అధికారికంగానే విజెఎఫ్ కి అధికారులే తాళాలు వేయనున్నారు. రికార్డులన్నీ స్వాధీనం చేసుకోనున్నారు. అయితే ఎన్ని రికార్డులు, బ్యాంకు ఖాతా పుస్తకాలు, సభ్యుల ఓటరు దరఖాస్తులు, ఇతర రికార్డులు ఇస్తారా..పరువు పోయిందని వాటిలో ముఖ్యమైనవాటిని మాయం చేస్తారా అనేది కూడా ఇప్పటి వరకూ కాలం చెల్లిన విజెఎఫ్ కార్యవర్గం చేసిన మోసం లానే మిగిలిపోతుందా అనేది తేలాల్సి వుంది.. చూడాలి రేపటి నుంచి ఏం జరుగుతుందనేది..!