చెమటలు పట్టిస్తున్న చీమలాపల్లి సర్వేనెంబరు-54


Ens Balu
155
Simhachalam
2023-08-09 03:48:33

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ లక్ష్మినృసింహ స్వామివారి దేవస్థానాకి చెందిన భూములు రికార్డులు తారుమారు చేసి కొట్టేస్తున్నవేళ చీమలాపల్లి సర్వే నెంబరు-54లోని 6.48 ఎకరాల భూమి విషయం ఇటు రెవిన్యూ, అటు దేవస్థానం అధికారులకు చెమటలు పట్టిస్తున్నది. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net విషయాన్ని బయటపెట్టడంతో అధికారులు, దీని వెనుక ఉన్న సూత్ర దారుల్లో హడావిడి మొదలైంది.  వాస్తవానికి భూమి సబ్ డివిజన్ కాకుండా దాని హక్కులు ఎవరికీ చెందవు.. ఆ భూమిలో నిర్మాణాలు చేయకూడదు.. కానీ విచిత్రంగా ఈ సర్వేనెంబరులో మాత్రం ఎంచక్కా ఆకాశ హార్మ్యాలు నిర్మించేస్తున్నా.. పెందుర్తిలోని రెవిన్యూ అధికారులు నోరు మెదపడం లేదు..పైగా ఆ భూమి రెవిన్యూది కాదని, మాకూ ఆ భూమికి ఎలాంటి సంబధం లేదని తెగేసి చెబుతున్నారు పెందుర్తి తహశీల్దార్ శ్యామ్. పోనీ సింహాచలం దేవస్థానం రికార్డుల్లోనైనా ఉన్నాయా అంటే అక్కడా కనిపించడం లేదు. పోనీ దీనిపై దేవస్థాన ఈఓని సంప్రదిస్తే..విచారణ చేస్తున్నాం..ఆ భూమి ఎవరి పరిధిలోకి వస్తుందో పరిశీలించి ప్రకటిస్తాం అని తీరిగ్గా సమాధానం చెబుతున్నారు ఈఓ వేండ్ర త్రినాధరావు.

అటు రెవిన్యూకీ చెందకా..ఇటు దేవస్థానం రికార్డుల్లోనూ లేక..అసలు ఆ సర్వే నెంబరులో మూడోవర్గానికి చెందిన వారు ఏ అర్హతతో నిర్మాణాలు సాగిస్తున్నారో.. వాటి వెనుక ఎవరున్నారనే విషయాన్ని కూపీలాగితే దేవస్థానంలోని ట్రస్టుబోర్డులోని ఒక సభ్యుడు కీలకంగా వ్యవహరించి..జివిఎంసీలోని 2వ స్థాయి నాయకుని అండతోనే వ్యవహారం చల్లగా చక్కబెట్టారనే విషయం గుప్పుమంది. ఇంతకీ ఆ భూమి విలువ ఎంతా ఆరా తీస్తే రూ.200 కోట్లకు పైమాటేనని చెబుతున్నారు. కనీసం అక్కడి భూములకు సంబందించి ఇచ్చిన అనుమతులేమైనా ఉన్నాయా అంటే అవేమీ ఇక్కడ కనిపించడం లేదు. కానీ సర్వేనెంబరు 54 కాకుండా.. 54(ఎ)(బి)గా డివిజన్ చేసినట్టుగా రికార్డులు బయటకొచ్చాయి. వాటి ఆధారంగానే వార్డు సచివాలయంలో టౌన్ ప్లానింగ్ ద్వారా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు కూడా పొందారు భూ హక్కు దారులు. అయితే ఒక భూమిలో ఇల్లు కట్లాలన్నా..పంటలు వేయాలన్నా ఖచ్చితంగా రెవెన్యూ వర్గాల అనుమతి అవసరం.

ఒకవేళ అది పంట భూమి అయితే దానిని సబ్ డివిజన్ చేసి.. నిర్మాణాలకు అనుగుణంగా ల్యాండ్ కన్వర్షన్ జిరాయితీగా చూపించి మార్పు చేయాలి.. అలా చేయాలంటే అసలు భూమి ఏ రికార్డుల ఆధారంగా జరిగిందో మొత్తం వ్యవహారం తేల్చిన తరువాత ఇదంతా సాధ్య పడుతుంది. కానీ వెబ్ ల్యాండ్ లో ఆ భూమి సింహాచలం దేవస్థానం పేరుతోనే దర్శనమిస్తున్నది. ఒకవేళ నిజంగా ఆ భూమి దేవస్థానానిదే అయితే ప్రభుత్వ పరంగా మార్పులు కూడా జరిగితీరాలి. కానీ దేవాదాయశాఖకు చెందిన భూములు అప్పనంగా ప్రజలకు ఇవ్వాలంటే దానికి చాలా పెద్ద తంతు సిసిఎల్ఏ, ప్రభుత్వ జిఓ, దేవాదాయశాఖ నుంచి లిఖిత పూర్వక ఉత్తర్వులు కూడా ఉండాలి. దానికంటే ముందు ట్రస్టుబోర్డు ఆమోదం, సదరు పంచాయతీలోని గ్రామసభ తీర్మాణం ఇలా చాలా పెద్ద తంతే నడవాల్సి వుంది. అయితే ఇదంతా ఈ సర్వేనెంబరు విషయంలో జరిగిందా అంటే అలాంటి ఛాయలేమీ ఇక్కడ కనపించలేదనే చెబుతున్నారు.

కాగా ఈ మొత్తం వ్యవహారం విశాఖజిల్లా కలెక్టరేట్ లోని రూరల్ రెవిన్యూ విభాగం ద్వారా జరిగినట్టు వార్తలొస్తున్నాయి. జిల్లా కలెక్టర్ కార్యలయంలో నుంచి భూముల వివరాలు రావాలన్నా దానికి కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ అనుమతులు తప్పని సరి. అదీ విషయం ప్రభుత్వ పరంగా జరగాలంటనే..అలా కాకుండా ప్రైవేటు వ్యహహారం, నిర్మాణాలు, భూమి బదలాయింపు, సబ్ డివిజన్, ల్యాండ్ కన్వర్షన్ తదితర పనులు జరగాలంటే మాత్రం రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తేనే అది సాధ్య పడుతుంది. అయితే ఈ పనులేమీ జరగకుండా లేనిది ఉన్నట్టు..ఉన్నది లేనట్టుగా చూపి సర్వేనెంబరు 54(ఎ)(బి) లు ఏ విధంగా తెరపైకి వచ్చాయనే విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. విషయం తెలుసుకున్న దేవస్థానం అధికారులు, రెవిన్యూ అధికారులు, నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసిన వార్డు సచివాలయం సిబ్బంది, చీమలాపల్లి ప్రాంతంలో ఈ సర్వేనెంబరు విషయంలో తలమునకలయ్యారు ఈ భూమికి చెందిన పూర్వపు ఉత్తర్వుల 
కోసం. ఈ సర్వేనెంబరు 54 విషయంలో ఏం చేస్తున్నారు..ఏ రికార్డుల మార్పులు, చేర్పులు చేశారు.. ఎక్కడి నుంచి తెచ్చారనే విషయం చీమలాపల్లి దారావాహికం-3లో చూడవచ్చు. మళ్లీ మీరు తాజా సమాచారం మిస్ అయిపోతారేమో Ens Live యాప్ ను గుగూల్ ప్లే స్టోర్ నుంచి ఇపుడే డౌన్ లోడ్ చేసుకోండి..!